ముద్దుకృష్ణమా.. మీరే మా గవర్నర్: హరీశ్ | will elect Gali muddu krishna Naidu to telangana as Governer, says Harish rao | Sakshi
Sakshi News home page

ముద్దుకృష్ణమా.. మీరే మా గవర్నర్: హరీశ్

Feb 14 2014 2:53 AM | Updated on Sep 2 2017 3:40 AM

ముద్దుకృష్ణమా.. మీరే మా గవర్నర్: హరీశ్

ముద్దుకృష్ణమా.. మీరే మా గవర్నర్: హరీశ్

టీడీఎల్పీ ఉపనేత గాలి ముద్దుకృష్ణమనాయుడు గురువారం శాసనసభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతున్నారు.

సాక్షి, హైదరాబాద్: టీడీఎల్పీ ఉపనేత గాలి ముద్దుకృష్ణమనాయుడు గురువారం శాసనసభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఇన్నర్ లాబీల్లో నుంచివచ్చిన హరీశ్‌రావు.. ఆయన్ను చూసి, ‘‘సార్.. రాష్ట్రం విడిపోతుందని ఏమీ బాధపడకండి. తెలంగాణ రాష్ర్టం వచ్చిన వెంటనే మిమ్మల్ని గవర్నర్‌గా నియమించుకుంటాం. హిజ్ ఎక్స్‌లెన్సీ అని గౌరవంగా పిలుచుకుంటాం’’ అని పేర్కొన్నారు.

 

దీంతో అక్కడే ఉన్న విలేకరులు స్పందిస్తూ.. ‘‘మరి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంగతి ఏమిటి’’ అని ప్రశ్నించారు. అయితే ఇద్దరికీ చెరో రెండున్నర సంవత్సరాలు అవకాశ ం కల్పిస్తామని హరీశ్ బదులిచ్చారు. అప్పుడే అక్కడకు వచ్చిన రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మీ మామ(కేసీఆర్)కు సన్నిహితులైన వారికేనా గవర్నర్ గిరీ ఇప్పించేది? మిగిలిన వారి సంగతి ఏమిటి’’ అని అనడంతో హరీష్ అక్కడి నుంచి నవ్వుతూ నిష్ర్కమించారు.

Advertisement
 
Advertisement
Advertisement