భర్త వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య | wife committed suicide due to husbands unmaritual relationship | Sakshi
Sakshi News home page

భర్త వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య

Aug 6 2015 6:43 PM | Updated on Sep 3 2017 6:55 AM

భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేస్తుండటంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

ఎల్లనూరు (అనంతపురం జిల్లా): భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేస్తుండటంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా ఎల్లనూరులో గురువారం జరిగిన ఈ సంఘటన వివరాలు.. ఎల్లనూరుకు చెందిన మిడిగంటి రామతులసి(21), అదే గ్రామానికి చెందిన అరవిందు ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇటీవల ఒక చిన్నారి పుట్టింది. అయితే అరవిందు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడని రామతులసి తల్లిదండ్రుల వద్ద వాపోయేది.

ఎన్నిసార్లు నచ్చజెప్పినా భర్త వినకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె మరణానికి తన అల్లుడు అరవిందు కారణమని రామతులసి తండ్రి రంగడు ఎల్లనూరు పోలీసులకు ఫిర్యాదుచేశారు. రామతులసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement