తెలంగాణపై అప్పుడులేని అభ్యంతరం ఇప్పుడెందుకు? | why seemandhra people object telangana, says damodara rajanarasimha | Sakshi
Sakshi News home page

తెలంగాణపై అప్పుడులేని అభ్యంతరం ఇప్పుడెందుకు?

Dec 23 2013 3:04 AM | Updated on Sep 27 2018 8:33 PM

తెలంగాణపై అప్పుడులేని అభ్యంతరం ఇప్పుడెందుకు? - Sakshi

తెలంగాణపై అప్పుడులేని అభ్యంతరం ఇప్పుడెందుకు?

తెలంగాణ అంశంపై గతంలో లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సీమాంధ్ర నేతలను ప్రశ్నించారు.

 సీమాంధ్రులకు ఉపముఖ్యమంత్రి దామోదర సూటిప్రశ్న
 మునిపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ  అంశంపై గతంలో లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సీమాంధ్ర నేతలను ప్రశ్నించారు. మెదక్ జిల్లా మునిపల్లి మండలంలో ఆదివారం  ఆయన మాట్లాడుతూ తెలంగాణ అంశాన్ని 2004-09 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టగా ఎటువంటి అభ్యంతరం వ్యక్తంచేయని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ప్రస్తుతం ఎందుకు అడ్డు తగులుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు.. కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసమే అవసరమా? అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement