అభయన్స్లో ఉన్న జీవో 22ను తెలుగుదేశం సర్కార్ ఎందుకు అమల్లోకి తెచ్చిందో చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు.
హైదరాబాద్ : అభయన్స్లో ఉన్న జీవో 22ను తెలుగుదేశం సర్కార్ ఎందుకు అమల్లోకి తెచ్చిందో చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నీటిపారుదల ప్రాజెక్ట్లలో రూ.22వేల కోట్ల దోపిడీకి బరితెగించారా ధ్వజమెత్తారు. గవర్నర్ నిలుపుదల చేసిన జీవోను మంత్రివర్గంలో చర్చించకుండా ఎలా అమల్లోకి తెస్తారని ధర్మాన సూటిగా అడిగారు.
ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజాధనం దుర్వినియోగం అయిందని గగ్గోలు పెట్టిన టీడీపీ...ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే పని చేస్తోందని ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాజధాని నిర్మాణంలో రెండు ప్రయివేట్ కంపెనీలకు 10వేల ఎకరాల భూమి ఇస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, దీని వెనుక మతలబు ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ బిడ్డింగ్లకు ప్రభుత్వం ఎందుకు వెళ్లడం లేదని ధర్మాన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్కు అవగాహన లేదన్న టీడీపీ నేతలు ఎన్నికల ముందు పొత్తు ఎందుకు పెట్టుకొన్నారో చెప్పాలన్నారు.