వాట్సప్ ఫొటోతో దొరికిపోయిన చైన్ స్నాచర్ | WhatsApp helps in thief’s arrest at Hyderabad | Sakshi
Sakshi News home page

వాట్సప్ ఫొటోతో దొరికిపోయిన చైన్ స్నాచర్

May 9 2015 8:16 PM | Updated on Aug 20 2018 4:27 PM

వాట్సప్ ఫొటోతో దొరికిపోయిన చైన్ స్నాచర్ - Sakshi

వాట్సప్ ఫొటోతో దొరికిపోయిన చైన్ స్నాచర్

నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్‌ను ఓ మహిళ పంపిన వాట్సప్ ఫొటో ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకుని పీడీ యాక్ట్ కింద శనివారం కేసు నమోదు చేశారు.

జీడిమెట్ల (హైదరాబాద్): నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్‌ను ఓ మహిళ పంపిన వాట్సప్ ఫొటో ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకుని పీడీ యాక్ట్ కింద శనివారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. సూరారం కాలనీకి చెందిన మహేందర్‌సింగ్ చౌడ (28) అనే వ్యక్తి బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయంలో హోంగార్డుగా పని చేస్తూ చైన్ స్నాచింగ్‌లకు తెగబడ్డాడు. హైదరాబాద్, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని మొత్తం 10 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఏకంగా 36 స్నాచింగ్‌లకు పాల్పడి పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరికి పాపం పండి ఓ మహిళ ఇచ్చిన వాట్సప్ ఫొటో మెసెజ్‌తో బండారం బట్టబయలైంది. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే మొత్తం ఒక కిలో 12 తులాల బంగారం రికవరీ అయ్యింది. ఏప్రిల్ నెలలో అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపగా తాజాగా సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ స్నాచర్లపై పీడియాక్ట్ ప్రయోగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement