గురువులకూ వెబ్ కౌన్సెలింగ్ | Web counseling teacher | Sakshi
Sakshi News home page

గురువులకూ వెబ్ కౌన్సెలింగ్

Aug 12 2015 2:10 AM | Updated on Sep 3 2017 7:14 AM

ఏలూరు సిటీ : ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమవుతోది. ఈసారి వెబ్ కౌన్సెలింగ్ విధానంలో కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుంది.

ఏలూరు సిటీ : ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమవుతోది. ఈసారి వెబ్ కౌన్సెలింగ్ విధానంలో కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుంది. ఈలోగా ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తిచేస్తారు. ఈనెల 16నాటికి బదిలీల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 14వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, సుమారు 4వేల మంది బదిలీ కౌన్సెలిం గ్‌కు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకేచోట రెండేళ్ల నుంచి ఎనిమిదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు స్థానచలనం పొందనున్నారు. బదిలీ కావాల్సిన ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
 
 cse.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.  ప్రక్రియ ప్రారంభించే నాటికి ఉన్న ఖాళీలు, ఎనిమిదేళ్ల సర్వీసు నిండిన వారి ఖాళీలు, క్రమబద్ధీకరణతో వచ్చిన ఖాళీల జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. షెడ్యూల్ ప్రకటించిన నాటినుంచి దరఖాస్తు చేసేందుకు 3 రోజుల గడువు ఉంటుంది.
 
 ఆన్‌లైన్ దరఖాస్తులు ఇలా..
 ఉపాధ్యాయులు తొలుత వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకుని ఎంఈవో లేదా ప్రధానోపాధ్యాయునికి సమర్పించాలి. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. ఎంఈవో లేదా ప్రధానోపాధ్యాయుడు దరఖాస్తును, సర్టిఫికెట్లను పరిశీలించి వాటిని ధ్రువీకరిస్తూ డీఈవోకు అప్‌లోడ్ చేస్తారు. వీటిని డీఈవో పరిశీలించిన అనంతరం ఉపాధ్యాయునికి ఎన్‌టైటిల్‌మెంట్ పాయిం ట్లు కేటాయిస్తారు.
 
 దరఖాస్తు గడువు ముగిసిన అనంతరం ఒక రోజులో పాయింట్ల కేటాయింపు పూర్తిచేస్తారు. దీని ఆధారంగా ప్రాధాన్యత క్రమాన్ని సూచిస్తూ జాబితా తయారు చేసి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలి. అభ్యంతరాలకు రెండు, మూడు రోజులు సమయం ఇస్తారు. అభ్యంతరాల పరిశీలన తరువాత తుది జాబితాను పొందుపరుస్తారు. దరఖాస్తుదారులు తుది ప్రాధాన్యత జాబితాను పరిశీలించి తమ క్యాడర్‌లో ఎవరు దరఖాస్తు చేశారో, ఏఏ పాఠశాలలకు అవకా శం వస్తుందో పరిశీలించుకుని కన్‌ఫర్మ్  చేయాలి. ఒకసారి కన్‌ఫర్మ్ చేస్తే ఆ ఉపాధ్యాయుని స్థానం కూడా ఖాళీల జాబితాలోకి వెళుతుంది. అయితే, ఉన్న స్థానం పోతుందనే ఆందోళన అవసరం లేదు.
 
 కన్ఫర్మ్ చేయగానే మీ మొబైల్ ఫోన్‌కు పాస్‌వర్డ్ వస్తుంది. దాంతో వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయితే మీ కేడర్‌కు సంబంధిం చిన ఖాళీలు ప్రత్యక్షమవుతాయి. ఖాళీ లను ప్రాధాన్యత క్రమంలో మౌస్ క్లిక్ ద్వారా ఎంపిక చేసుకోవాలి. తప్పనిసరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులు తమ కేడర్‌లో ప్రదర్శించిన ఖాళీలకు ప్రాధాన్యత క్రమం ఇవ్వాల్సి ఉంది. ఉదాహరణకు ఒక కేడర్‌లో 500ఖాళీలు ఉంటే అన్నిటికీ ఆప్షన్లు ఇవ్వాలి. రెండు నుంచి ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తికాని ఉపాధ్యాయులు తమకు అవసరమైన పాఠశాలను మాత్రమే ఎంపిక చేసుకోవచ్చు. దీనికి గరిష్ట పరిమితి 199 ఆప్షన్లు మాత్ర మే. ఉపాధ్యాయుడు ఎన్ని ఆప్షన్లు ఇచ్చినా చివరి ఆప్షన్‌గా తాను పనిచేస్తు న్న పాఠశాలను విధిగా చేర్చాలి. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 5రోజుల్లో బదిలీ ఉత్తర్వులు వెబ్‌సైట్ నుంచి తీసుకునే అవకాశం ఉంది. బదిలీ సమాచారం ఉపాధ్యాయుల మొబైల్‌కు మెసేజ్ వస్తుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement