
సాక్షి, అమరావతి: ఇంటి నుంచి బయటకు వస్తే మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ, పనిచేసే ప్రదేశాలతో పాటు ప్రయాణాల సమయంలో మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోవిడ్–19 నియంత్రణలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలు మాస్క్‌ను ధరించడం అలవాటుగా మార్చుకునే విధంగా స్థానిక జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా కోరారు.