ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాకుండా స్టే ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది
విజయవాడ: ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాకుండా స్టే ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. తీర్పులో మనకు వ్యతిరేకంగా ఉన్న పలు అంశాలను సవరించాల్సిందిగా కోరనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో రాష్ట్రం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్‌పీ) పెండింగ్‌లో ఉంది. కృష్ణా జలాలకు సంబంధించి వెలువడిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ తాజా తీర్పు వల్ల కృష్ణా డెల్టా రైతులు తీవ్రంగా నష్ట పోతారని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన తీర్పు వల్ల రైతుల నష్టపోయే అవకాశం ఉందన్నారు.