tribunal verdict
-
ఆ ట్రిబ్యునల్ తీర్పు చెత్త కాగితంతో సమానం!: చైనా
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంపై 2016లో అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు చెత్తకాగితంతో సమానమని చైనా వ్యాఖ్యానించింది. ఆ తీర్పును తాము గౌరవించేది లేదని స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ తీర్పును అమెరికా సమర్ధించడం తమపై నింద మోపేందుకు చేసే ప్రహసనమని చైనా ప్రతినిధి జావో లిజ్జియన్ విమర్శించారు. ఇటీవలే తమ సముద్ర జలాల్లోకి వచ్చిన యూఎస్ యుద్ధ నౌకను తరిమి కొట్టామని చైనా ప్రకటించింది. దక్షిన చైనా సముద్రంపై తమకు హక్కుందని చైనా వాదిస్తుండగా, అలాంటిదేమీ లేదంటూ అప్పుడప్పుడు యూఎస్ ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటుంది. ఈ విషయమై ట్రిబ్యునల్ తీర్పును గౌరవించాలని అమెరికా చెబుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ఫిలిప్పీన్స్‌కు తమకు ద్వైపాక్షిక ఒప్పందాలున్నందున, దక్షిన చైనా జలాల్లో వాటాలకు సంబంధించి ఫిలిప్పీన్స్‌పై చైనా ఎలాంటి దాడి చేసినా, తాము జోక్యం చేసుకోక తప్పదని యూఎస్ స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం హెచ్చరించారు. దీనిపై ప్రతిస్పందిస్తూ చైనా తాజా వ్యాఖ్యలు చేసింది. తాము ఆ తీర్పును గౌరవించమని, ఎప్పటిలాగే ఈ జలాలపై తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. దక్షిణ చైనా సముద్రంలోని పరాసెల్స్ దాదాపు వంద ద్వీపాల సముదాయం. వీటిపై చైనా, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనే దేశాలు చారిత్రకంగా తమకే హక్కు ఉందని చెప్పుకుంటున్నాయి. అయితే జులై 12, 2016లో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం చైనాకు దక్షిణ చైనా సముద్రంపై చారిత్రకంగా ఎలాంటి హక్కూ లేదని తీర్పునిచ్చింది. అంతేగాక, ఫిలిప్పీన్స్‌కు ఉన్న చేపలు పట్టే హక్కును ఉల్లంఘిస్తోందనీ, రెడ్ బ్యాంకు వద్ద చమురు, సహజవాయువు నిక్షేపాల కోసం మైనింగ్ చేయడం ద్వారా ఆ దేశ సార్వభౌమత్వాన్ని చైనా ఖాతరు చేయడం లేదని పేర్కొంది. -
ట్రిబ్యునల్ తీర్పుపై అభిప్రాయాలివ్వండి
-రిటైర్డ్ ఇంజినీర్లను కోరిన మంత్రి హరీష్‌రావు హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని రిటైర్డ్ ఇంజినీర్లకు నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ఈ అంశమై రాష్ట్రానికి న్యాయం జరిగే రీతిలో కోర్టులు, ట్రిబ్యునల్ ముందు పోరాడతామని స్పష్టం చేశారు. బుధవారం ఇక్కడి జల సౌధలో రిటైర్డ్ ఇంజినీర్లతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి రిటైర్డ్ ఇంజినీర్లు చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డి, వెంకటరామారావుతో పాటు మరికొంతమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల వేగిరానికి తీసుకోవాల్సిన చర్యలు, కృష్ణా జలాల తీర్పు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కొందరు ఇంజినీర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించడమే ఉత్తమమని సూచనలు చేసినట్లుగా తెలిసింది. రెండు రోజుల్లో అభిప్రాయాలు చెబుతూ నోట్ ఇస్తే దాన్ని సైతం పరిశీలనలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. 29న అన్ని అంశాలపై చర్చిస్తామని, సుప్రీం సీనియర్న్యాయవాది వైద్యనాధన్ సూచనల మేరకు నడుచుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. -
ట్రిబ్యునల్ తీర్పుపై అఖిలపక్ష సమావేశం
-
ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్రానికి గొడ్డలి పెట్టు
-
ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: పార్థసారథి
విజయవాడ: ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాకుండా స్టే ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. తీర్పులో మనకు వ్యతిరేకంగా ఉన్న పలు అంశాలను సవరించాల్సిందిగా కోరనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో రాష్ట్రం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) పెండింగ్‌లో ఉంది. కృష్ణా జలాలకు సంబంధించి వెలువడిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ తాజా తీర్పు వల్ల కృష్ణా డెల్టా రైతులు తీవ్రంగా నష్ట పోతారని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన తీర్పు వల్ల రైతుల నష్టపోయే అవకాశం ఉందన్నారు.