భారీ పెట్టుబడుల్ని సాధిస్తాం: పల్లె రఘునాథ్ రెడ్డి | Sakshi
Sakshi News home page

భారీ పెట్టుబడుల్ని సాధిస్తాం: పల్లె రఘునాథ్ రెడ్డి

Published Mon, Jul 28 2014 6:25 PM

భారీ పెట్టుబడుల్ని సాధిస్తాం: పల్లె రఘునాథ్ రెడ్డి - Sakshi

హైదరాబాద్: ఐటీ, ఎలక్ట్రానిక్‌, ఈ గవర్నెన్స్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్లూ ప్రింట్ విడుదల చేసింది.  2020 నాటికి ఐటీరంగంలో రూ.12వేల కోట్లు, ఎలక్ట్రానిక్ రంగంలో రూ.30వేల కోట్ల పెట్టుబడులు సాధించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. పెట్టుబడుల ఆధారంగా  5 లక్షల ఉద్యోగాలు సృష్టించాలనుకుంటున్నామని రఘునాథరెడ్డి వెల్లడించారు. 
 
రాష్ట్ర విభజనతో ఎలక్ట్రానిక్ రంగం పూర్తిగా దెబ్బతిందని,  6,500 కోట్ల టర్నోవర్‌కు గాను ఏపీకి కేవలం 375 కోట్ల రూపాయలు వచ్చాయన్నారు. ఎలక్ట్రానిక్స్‌లో 20 మేనిఫ్యాక్చరింగ్ క్లస్టర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.  మెగా ఎలక్ట్రానిక్‌ ఈవెంట్‌, ఎలక్ట్రానిక్ బజార్‌లను విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఏర్పాటుచేస్తామని ఏపీ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

Advertisement
Advertisement