తమ పార్టీ సమైక్యవాదానికే కట్టుబడి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు స్పష్టం చేశారు.
తమ పార్టీ సమైక్యవాదానికే కట్టుబడి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు స్పష్టం చేశారు. గురువారం ఆయన అనంతపురంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాహుల్గాంధీని ప్రధానమంత్రిని చేయడానికే రాష్ట విభజనకు కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన సొంతింటి వ్యవహారంగా కాంగ్రెస్ భావిస్తుందని రాఘవులు పేర్కొన్నారు. రాష్ట విభజన వల్ల తాగు,సాగు నీటి సమస్యలు అధికమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజ్యసభ సభ్యుడు వీహెచ్కు దురుసుతనం ఎక్కువ... అయిన ఆయనపై సమైక్యవాదులు తిరుపతిలో దాడి చేయడం సరికాదని రాఘవులు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రపై మాత్రం ఈ సందర్భంగా రాఘవులు మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్ర విభజనను సమర్థిస్తున్నారా లేదా అనే విషయాన్ని స్ఫష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ విషయంలో స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే ఆత్మగౌరవ యాత్ర చేపట్టాలని చంద్రబాబుకు రాఘవులు సూచించారు.