గండికోటకు నీరు విడుదల | water release  into gandikota project  | Sakshi
Sakshi News home page

గండికోటకు నీరు విడుదల

Oct 12 2017 1:20 PM | Updated on Oct 12 2017 1:20 PM

రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి గండికోట ప్రాజెక్టుకు గురువారం నీటిని విడుదల చేశారు.

సాక్షి, కర్నూలు: రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి గండికోట ప్రాజెక్టుకు గురువారం నీటిని విడుదల చేశారు. జిల్లాలో గల అవుకు రిజర్వాయర్ నుంచి 1000 క్యూసెక్కుల నీటిని వైఎస్సార్‌ జిల్లాలోగల గండికోట ప్రాజెక్టుకు విడుదల చేశారు. రెండు రోజులుగా కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతూ మధ్య తరహా ప్రాజెక్టులు కూడా నిండాయి. కాగా... అవుకు రిజర్వాయర్ లోకి భారీగా వరద నీరు వస్తున్న దృష్ట్యా 1000 క్యూసెక్కుల నీటిని గండికోట ప్రాజెక్టుకు విడుదల చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement