ఎప్పుడెప్పుడా అని జనం...రాజకీయ నాయకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎన్నికలకు ఎట్టకేలకు సమరభేరి మోగింది.
ఒంగోలు, న్యూస్‌లైన్: ఎప్పుడెప్పుడా అని జనం...రాజకీయ నాయకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎన్నికలకు ఎట్టకేలకు సమరభేరి మోగింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ బుధవారం అధికారికంగా విడుదల చేసింది. జిల్లాలో ఏప్రిల్ 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ మే 28వ తేదీలోపు ముగుస్తుంది.
జిల్లాలో పరిస్థితి:
జిల్లాలో మొత్తం 24,09,910 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఒకరు ఎన్‌ఆర్‌ఐ ఓటరు, 7,728 మంది సర్వీస్ ఓటర్లు. మిగిలిన 24,02,181 మంది ఓటర్లలో 11,94,231 మంది పురుషులు, 12,07,814 మంది మహిళలు, 136 మంది ఇతరులకు ఓట్లున్నాయి.