‘ఉక్కు’ను ఆదుకుంటాం | Visakhapatnam steel industry | Sakshi
Sakshi News home page

‘ఉక్కు’ను ఆదుకుంటాం

Oct 19 2014 2:10 AM | Updated on Aug 29 2018 3:33 PM

రాష్ట్రంలోనే ప్రధానమైన విశాఖ ఉక్కు పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

విశాఖపట్నం: రాష్ట్రంలోనే ప్రధానమైన విశాఖ ఉక్కు పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తుఫాన్ వల్ల స్టీల్‌ప్లాంట్‌కు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు ఆయన శనివారం రాత్రి స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఈడీ (వర్క్స్) భవనంలో ఉక్కు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్లాంట్‌ను కాపాడుకోవడం అత్యవసరమన్నారు.

గతంలో ప్లాంట్‌ను ప్రైవేటుపరం కాకుండా కాపాడామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. విద్యుత్ కొరత ఉన్నప్పటికి ప్లాంట్‌కు ప్రాధాన్యత ఇచ్చి మొదట విద్యుత్ అందించామని సీఎం అన్నారు.  ప్లాంట్‌ను డిజిన్వెస్ట్‌మెంట్ చేయకుండా చూడాలన్న కార్మిక సంఘాల విజప్తికి ఆయన సానుకూలంగా స్పంది స్తూ అలాంటివి  ఉండవన్నారు.

అంతకు ముందు  అయన  ప్లాంట్ కోక్ ఒవెన్స్‌కు చేరుకోని బ్యాటరీలను పరిశీలించారు. సీఎండీ పి.మధుసూదన్, డైరక్టర్(ఆపరేషన్స్) డి.ఎన్.రావు ఆయనకు బ్యాటరీల పనితీరు గురించి వివరించారు.  మూడో బ్లాస్ట్ ఫర్నేస్‌కు వెళ్ళి అక్కడి ఉద్యోగుల తో మాట్లాడారు. గాజువాక ఎమ్మెల్యే ప ల్లా శ్రీనివాసరావు, కార్మిక నాయకులు ఆదినారాయణ, ఎన్,రామారావు, మం త్రి రాజశేఖర్, గంధం వెంకటరావు, వరసాల శ్రీనివాసరావు, బొడ్డు పైడిరాజు,  విల్లా రామ్మోహన్‌కుమార్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement