ఎల్‌జీ పాలిమర్స్‌ సీజ్

Visakha LG Polymers Siege - Sakshi

విశాఖపట్నం: స్టైరీన్‌ గ్యాస్‌ లీకేజీ ప్రమాదానికి కారణమైన ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీని జిల్లా రెవిన్యూ అధికారులు సోమవారం సీజ్‌ చేశారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.  ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో ఈ నెల 7వ తేదీన జరిగిన గ్యాస్‌ లీకేజీ ఘటనలో 12 మంది మృత్యువాతపడగా 585 మంది అస్వస్థతకు గురయ్యారు.

అయితే ఈ ప్రమాదాన్ని రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపడుతోంది. ముందుగా కంపెనీని సీజ్‌ చేయడంతో పాటు డైరెక్టర్ల పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం విశాఖ ఆర్డీఓ పెంచల కిషోర్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ ఎ.రామలింగరాజు, ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ప్రసాద్‌ ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీని సీజ్‌ చేశారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే కంపెనీని మూసివేసినట్లు ఆర్డీఓ తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top