సమదూరంలో విజయవాడ | Vijayawada in equal distance | Sakshi
Sakshi News home page

సమదూరంలో విజయవాడ

Feb 22 2014 8:31 PM | Updated on Sep 2 2017 3:59 AM

సమదూరంలో విజయవాడ

సమదూరంలో విజయవాడ

భౌగోలికంగా రాయలసీమకు, ఉత్తరకోస్తాకు సమ దూరంలో ఉండే నగరం విజయవాడ అని, రాజధానికి కావాల్సిన అన్ని వసతులూ ఆ నగరంలో ఉన్నాయని మంత్రి పార్ధసారధి చెప్పారు.

విజయవాడ: భౌగోళికంగా రాయలసీమకు, ఉత్తరకోస్తాకు సమదూరంలో ఉండే నగరం విజయవాడ అని, రాజధానికి కావాల్సిన అన్ని వసతులూ ఆ నగరంలో ఉన్నాయని మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి చెప్పారు. తాగునీరు, విద్య, వైద్య సౌకర్యాలు కూడా విజయవాడలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

విజయవాడ చుట్టుపక్కల ప్రభుత్వ స్థలం 20 వేల ఎకరాలు ఉన్నాయని చెప్పారు. అటవీ భూమి 7 వేల ఎకరాలు ఉన్నాయని తెలిపారు. విజయవాడను రాజధానిగా అభివృద్ధి చేస్తే గుంటూరు, ఏలూరు నగరాలు కూడా అభివృద్ధి చెందుతాయనన్నారు. విజయవాడను రాజధానిగా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పార్థసారధి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement