దూరదర్శన్ ఉన్నతోద్యోగి ఒకరు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు.
విజయవాడ : దూరదర్శన్ ఉన్నతోద్యోగి ఒకరు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. విజయవాడ దూరదర్శన్ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ హనుమంతరావు గురువారం లక్షన్నర లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు.
టెలీ సీరియల్స్ బిల్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేయటంతో బాధితులు సీబీఐని ఆశ్రయించారు. దాంతో రంగంలోకి దిగిన సీబీఐ...అధికారి లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం హనుమంతరావును అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.