విజయవాడలో పేదలకు అండగా రేడియో గ్రూప్‌ | Vijayawada Amateur Radio Ham Radio Group Members Food Distribution Services | Sakshi
Sakshi News home page

విజయవాడలో పేదలకు అండగా రేడియో గ్రూప్‌

Apr 18 2020 8:49 AM | Updated on Apr 18 2020 8:56 AM

Vijayawada Amateur Radio Ham Radio Group Members Food Distribution Services  - Sakshi

 సాక్షి, విజయవాడ:   కరోనా వైరస్‌ని కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ను విధించడంతో చాలా మంది ఆహారం అందక పూట గడవక ఇబ్బంది పడుతున్నారు. అది వర​​కు పనులు చేసుకొని స్వశక్తితో బతికిన వారు ఇప్పుడు సాయం అందించే వారికి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రోజులో కనీసం ఒకపూట కూడా తిండిలేక కన్నీళ్లతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు దేశంలో కరోనా మహమ్మారి మరింత విజృంభించడంతో భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ మే3 వరకు పొడిగించింది. దీంతో నిరుపేదలు, వలసకూలీలు, నిరాశ్రయుల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది.  అలాంటి నిర్భాగ్యులను ఆదుకోవడానికి చాలా స్వచ్ఛంధ సంస్థలు ముందుకొచ్చి అండగా నిలబడుతున్నాయి. (మానవ సేవే మాధవ సేవమానవ సేవే మాధవ సేవ)

విజయవాడకు చెందిన అమెచ్యూర్‌ రేడియో-హామ్‌ రేడియో గ్రూప్‌ సభ్యులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటూ ఉపాధి కోల్పోయి పస్తులు ఉంటున్న వలసకార్మికులకు, పేదలకు, అనాధలకు, అదేవిధంగా శానిటరీ వర్కర్స్‌కి నిత్యవసర సరుకులు, భోజనం ప్యాకెట్లను పంపిణి చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. మీరు కూడా ఇలాంటి సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాటిని సాక్షి.కామ్‌తో పంచుకోవడం ద్వారా మరికొందరిలో స్ఫూర్తి నింపండి. మీరు వివరాలు పంపించాల్సిన మెయిల్‌ ఐడీ webeditor@sakshi.com. (వెల్లివిరుస్తున్న మానవత్వం)

ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 22,40,191 మంది కరోనా బారిన పడగా 1,53,822 మంది మరణించారు. ఇక భారతదేశం విషయానికి వస్తే 13,835 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 1,767 మంది రికవరీ అయ్యారు, 452 మంది మరణించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 766కుపైగా కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 534 కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 

ఆపన్నహస్తం అందిస్తున్న అభయం పౌండేషన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement