నవరత్నాలతోనే పేదల అభ్యున్నతి | Vijayasai Reddy Visit Villages In Araku | Sakshi
Sakshi News home page

నవరత్నాలతోనే పేదల అభ్యున్నతి

Jan 18 2019 4:21 PM | Updated on Jan 18 2019 4:27 PM

Vijayasai Reddy Visit Villages In Araku - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అరకు మండలం కొర్రయిగూడ గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. శుక్రవారం వైఎస్సార్‌ సీపీ స్థానిక నాయకులు చెట్టి ఫాల్గుణ, మత్స లింగం, దన్ను దొర, పార్టీ కార్యకర్తలు, పలువురు ప్రతినిధులతో కలిసి కొర్రయిగూడ గ్రామాన్ని ఆయన సందర్శించారు.  గ్రామాభివృద్ధిలో భాగంగా మంచి నీటి బోర్లు, సీసీ రోడ్డు నిర్మాణాల కోసం ఎంపీ నిధులను మంజూరు చేశారు. ఈ సందర్బంగా విజయసాయి రెడ్డికి గ్రామ ప్రజలు టీడీపీ హయాంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి విన్నవించుకున్నారు. డ్వాక్రా రుణాలు అందడం లేదని మహిళలు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. వృద్ధాప్య ఫించన్లు, ఇళ్లు మంజూరు చేయడం లేదని గిరిజనులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవేశపెట్టే నవరత్నాల ద్వారా అందరి సమస్యలు పరిష్కారం అవుతాయని, పేదల అభ్యున్నతి సాధ్యమవుతుందని విజయసాయి రెడ్డి వారికి భరోసానిచ్చారు   

Advertisement
 
Advertisement
Advertisement