‘వామ్మో! రవిప్రకాశూ నువ్వు మామూలోడివి కాదు’ | Vijaya Sai Reddy Comment On Ravi Prakash In Twitter | Sakshi
Sakshi News home page

‘వామ్మో! రవిప్రకాశూ నువ్వు మామూలోడివి కాదు’

May 18 2019 6:09 PM | Updated on May 18 2019 6:11 PM

Vijaya Sai Reddy Comment On Ravi Prakash In Twitter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడి అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా మరోసారి మండిపడ్డారు. వామ్మో రవి ప్రకాశూ నువ్వు మామూలోడివి కాదంటూ ఆయన అక్రమాల పుట్టను భట్టబయలు చేశారు. ‘‘బ్రోకర్ శివాజీని పట్టుకుని పోలీసులు తమ స్టైల్‌లో ప్రశ్నిస్తే గరుడ పురాణం స్క్రిప్ట్ ఎవరిచ్చారో కక్కేస్తాడు. అది మీడియా ‘నయీం’ పనే అని తేలుతుంది. ఈ నేరాలు విచారించాలంటే స్పెషల్ కోర్టులు కావాలి. 25 ఏళ్ల క్రితం వేయి జీతానికి పనిచేసినోడు వందల కోట్లు ఎలా పోగేశాడో తేల్చాలి. క్రీ.శ.193లో రోమన్ చక్రవర్తి పెర్టినాక్స్‌ను అతని సైన్యమే హతమార్చి సామ్రాజ్యాన్ని వేలంలో అమ్మేశారట. రవిప్రకాష్‌ దాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చాడు. టీవీ9 లోగోలను రూ.99 వేలకు తన మోజోటివీకే విక్రయించి కార్పోరేట్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాడు. వామ్మో!రవిప్రకాశూ నువ్వు మామూలోడివి కాదు’’ అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.

కాగా అంతకుముందు కూడా రవిప్రకాశ్‌పై విజయసాయి రెడ్డి ట్విట్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ‘‘బాధితులు పెద్ద సంఖ్యలో టీవీ9 కొత్త మేనేజ్‌మెంటుకు తమ గోడు వెల్లబోసుకుంటున్నారట’’ అంటూ ట్విటర్‌లో ఆరోపించారు. 

Advertisement
 
Advertisement
Advertisement