కెరీర్‌ను గౌరవించండి | Sakshi
Sakshi News home page

కెరీర్‌ను గౌరవించండి

Published Fri, Jan 22 2016 7:24 AM

Vice Admiral Satish Soni advices IIM students to respect their

ఐఐఎం విద్యార్థులకు వైస్ అడ్మిరల్ సతీశ్ సోనీ సూచన

 విశాఖపట్నం: వేతన ప్యాకేజీలతో నిమిత్తం లేకుండా ఎంచుకున్న వృత్తిని గౌరవించాలని ఈస్టర్న్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ సతీశ్ సోని ఐఐఎం విద్యార్థులకు సూచించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) విశాఖపట్నం ప్రథమ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు, సమాజాభివృద్ధికి పాటుపడేందుకు వేతనాలకై చూడకుండా వృత్తిని గౌరవించాలని చెప్పారు. నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు, వ్యక్తిత్వ వికాసానికి హార్డ్‌వర్క్, సిన్సియారిటీ ఎంతో ముఖ్యమని తెలిపారు. తీర ప్రాంత రక్షణ, దేశ ఆర్థికాభివృద్ధిలో నేవీ కీలకపాత్ర పోషిస్తోందని చెప్పారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement