షాపులోనే వ్యాపారి ఆత్మహత్య | Venkata satish suicide in tenali | Sakshi
Sakshi News home page

షాపులోనే వ్యాపారి ఆత్మహత్య

Jan 20 2016 8:36 AM | Updated on Nov 6 2018 7:56 PM

గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది.

గుంటూరు : గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని గాంధీచౌక్లో ప్రాంతానికి చెందిన వ్యాపారి వెంకట సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఆర్థరాత్రి షాపులోనే అతడు ఉరి వేసుకున్నాడు. ఆ విషయాన్ని బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు షాపు వద్దకు చేరుకుని.... మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement