నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో డీసీసీ బ్యాంక్ మేనేజర్‌పై వేటు పడింది.
వైఎస్సార్: నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో డీసీసీ బ్యాంక్ మేనేజర్‌పై వేటు పడింది. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలంలో ఆదివారం జరిగింది. వివరాలు.. వేంపల్లె డీసీసీబీ మేనేజర్ ధనంజయ్‌రావు.. జాయింట్ లాకర్ ఉన్న ఖాతాదారుల్లో ఒకరిని మాత్రమే లాకర్ తెరిచేందుకు అనుమతించారు.
అంతే కాకుండా అక్రమాలకు పాల్పడినట్లు పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు డీసీసీ బ్యాంక్ డీజీఎమ్ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో వేంపల్లె డీసీసీ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసిన ధనంజయరావు ప్రస్తుతం ఎల్‌ఆర్‌పల్లిలో సుపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.