వేలూరు జైలుకు తీవ్రవాదుల తరలింపు | Vellore to move the terrorists to prison | Sakshi
Sakshi News home page

వేలూరు జైలుకు తీవ్రవాదుల తరలింపు

Jun 11 2014 2:07 AM | Updated on Aug 21 2018 5:46 PM

రెండు రోజుల విచారణ నిమిత్తం తీవ్రవాదులను కస్టడీకి తీసుకున్న పోలీసులు మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాం తంలో పుత్తూరు కోర్టులో హాజరుపరిచారు.

పుత్తూరు: రెండు రోజుల విచారణ నిమిత్తం తీవ్రవాదులను కస్టడీకి తీసుకున్న పోలీసులు మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాం తంలో పుత్తూరు కోర్టులో హాజరుపరిచారు. జడ్జి అనుమతి తీసుకున్న అనంతరం పుత్తూరు డీఎస్పీ కృష్ణకిషోర్‌రెడ్డి, ఏఆర్ డీఎస్పీ దేవదాస్ నేతృత్వంలో తీవ్రవాదులైన బిలాల్ మాలిక్, ఇస్మాయిల్, ఫక్రుద్దీన్‌ను గట్టి బందోబస్తు మధ్య పోలీసు వాహనంలో తమిళనాడులోని వేలూరు జైలుకు తరలించారు. కాగా విచారణ నిమిత్తం హైదరాబాదు నుంచి సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఇద్దరు డీఎస్పీలు పుత్తూరుకు వచ్చారు.

రెండు రోజుల విచారణ లో ఎలాంటి కొత్త అంశాలు లేవని, గతంలో తమిళనాడు పోలీసులకు చెప్పిన విషయాలనే ఏపీ పోలీసు అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్టు తెలియవచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తమిళనాడులో పలు నేరాలకు సంబంధించి కేసులు నమోదై ఉన్నం దున ఈ తీవ్రవాదులను పట్టుకునేందుకు పల మనేరు, పుంగనూరు, చిత్తూరు, మదనపల్లె వంటి ప్రాంతాల్లో వారి ఫొటోలతో పోస్టర్లు వెలిశాయి. దీంతో  అక్కడ ఇబ్బందులు తప్పవని తీవ్రవాదులు గ్రహించారు.

తమిళనాడు కు సరిహద్దులోని నగరి, పుత్తూరు పట్టణాల్లో పోస్టర్లు కనిపించక పోవడంతో ఈ ప్రాంతాన్ని అనుకూలంగా ఎంచుకున్నారు. కాగా పుత్తూ రు పట్టణంలోని గేట్ పుత్తూరును స్థావరంగా చేసుకున్నారు. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావనే విషయాన్ని గుర్తించారు. చిన్నచిన్న వ్యాపారాలతో స్థానికులను నమ్మిం చారు. అద్దెకు తీసుకున్న నివాస గృహాలనే బాంబు తయారీకి అడ్డాగా చేసుకున్నారు.  భారీ విస్పోటనాలకు సంబంధించిన ముడిసరకును తెచ్చుకుని తయారీ అనంతరం వాటిని కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తున్న ట్టు తీవ్రవాదులు విచారణలో వెల్లడించినట్టు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా కార్యకలాపాలు సాగిస్తున్నారా అనే కోణంలో విచార ణ చేసినట్టు సమాచారం. అయితే తమిళనా డు, కర్నాటక రాష్ట్రాల్లోని కొందరు నేతలే తమ టార్గెట్ అనే విషయాన్ని తీవ్రవాదులు పోలీసు అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. విచారణలో తీవ్రవాదులు సహకరించినా, ఆహార పదార్థాల విషయంలో మాత్రం వారు కోరుకున్నవి అందించడంలో పోలీసు అధికారులకు ఆగ్రహం తెప్పించినా తప్పని పరిస్థితి ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement