వాహన దొంగల అరెస్ట్ | Vehicle thieves gang arrested | Sakshi
Sakshi News home page

వాహన దొంగల అరెస్ట్

Sep 15 2015 2:49 PM | Updated on Aug 20 2018 4:44 PM

వాహనాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అనంతపురం టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతపురం : వాహనాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అనంతపురం టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం రూరల్ మండలం కత్తులపల్లి వద్ద సోమవారం రాత్రి నర్సింహులు (26), శ్రీశైలం నాగరాజు (34), గంగాథర్(30)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారిని అరెస్ట్ చేసినట్టు మంగళవారం మీడియాకు తెలిపారు. నిందితుల నుంచి రెండు ఆటోలు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ నెల 6 వ తేదీన ప్రభుత్వ ఆస్పత్రి పార్కింగ్ ప్రదేశంలో ఆటోలు ఉండగా కొట్టేసినట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement