కేంద్రమంత్రులకు దమ్ము, ధైర్యం లేదా? | Vasireddy padma takes on seemandhra mps | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రులకు దమ్ము, ధైర్యం లేదా?

Feb 6 2014 4:13 PM | Updated on Sep 27 2018 5:59 PM

కేంద్రమంత్రులకు దమ్ము, ధైర్యం లేదా? - Sakshi

కేంద్రమంత్రులకు దమ్ము, ధైర్యం లేదా?

రాష్ట్ర విభజనను జరగనివ్వమంటూ గతంలో ప్రగల్భాలు పలికిన కేంద్రమంత్రులు ఇప్పుడు ఏం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

హైదరాబాద్ : రాష్ట్ర విభజనను జరగనివ్వమంటూ గతంలో ప్రగల్భాలు పలికిన కేంద్రమంత్రులు ఇప్పుడు ఏం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విభజనపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం కేంద్రమంత్రులకు లేదా అని ఆమె గురువారమిక్కడ సూటిగా ప్రశ్నించారు. జీవోఎంకు సవరణలు ఇవ్వటం అవమానకరమని వాసిరెడ్డి మండిపడ్డారు.

 తెలుగు ప్రజల కత్తి పడుతుంటే ...మరోవైపు ఎంపీలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం లాబీలు చేయటం దురదృష్టకరమన్నారు. కేంద్రంలో వారు లాలూచీ పడకపోతే వారు విభజనను ప్రశ్నించేవారని అన్నారు. ప్రజలు ఏమైనా పరవాలేదు...మా వ్యాపారాలు, కంపెనీలు ఉండాలి... అనే ధోరణిలో సీమాంధ్ర ఎంపీలు ఉన్నారని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. కేంద్రంతో ఎందుకు తేల్చుకోలేకపోతున్నారని ఆమె ప్రశ్నించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement