జగన్ సభకు హాజరైన వారిపై వంశీ అనుచరుల దాడి!
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరాశ, నిస్పృహలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరాశ, నిస్పృహలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చి వెళుతున్న వారిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొత్త మల్లవల్లిలో చోటుచేసుకుంది.
వంశీ ఆదేశాల మేరకే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడి చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ దాడిని వైఎస్ఆర్సీపీ శ్రేణులు తిప్పి కొట్టడంతో ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగినట్టు సమాచారం. ఈ ఘటనలో ఆరుగురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. అదే గ్రామంలోని కొన్ని ఇళ్లపై మరోసారి టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.