సీఎం జగన్‌ను కలిసిన అమెరికా కాన్సూల్‌ జనరల్‌ | US Consulate General Katherine B Hadda meets CM YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన అమెరికా కాన్సూల్‌ జనరల్‌

Jul 2 2019 12:20 PM | Updated on Jul 2 2019 3:23 PM

US Consulate General Katherine B Hadda meets CM YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, అమరావతి: అమెరికా కాన్సూల్‌ జనరల్‌ క్యాథరీన్‌ బీ హడ్డా మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అమరావతిలోని సచివాలయంలో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నట్టు తెలుస్తోంది.

లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సూల్‌ జనరల్‌ కాథరీన్‌ హడ్డా ట్విటర్‌లో అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. ‘‘ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైఎస్‌ జగన్‌కు అభినందనలు. భవిష్యత్తులో అమెరికా, ఆంధ్రప్రదేశ్‌ మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నా’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. గతంలో వైఎస్‌ జగన్‌తో దిగిన ఫోటోను ఆమె ట్విటర్‌లో ఈ సందర్భంగా షేర్‌ చేశారు. 
(చదవండి: వైఎస్‌ జగన్‌కు యూఎస్‌ కాన్సులేట్‌ అభినందనలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement