వైఎస్‌ జగన్‌కు యూఎస్‌ కాన్సులేట్‌ అభినందనలు | US Consulate Katherine Hadda Congratulates To YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌కు యూఎస్‌ కాన్సులేట్‌ అభినందనలు

May 24 2019 12:31 PM | Updated on May 24 2019 2:47 PM

US Consulate Katherine Hadda Congratulates To YS Jagan - Sakshi

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి.

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖులతో పాటు దేశ వ్యాప్తంగా ప్రధానితో సహా పలువురు జాతీయ నేతలు కూడా వైఎస్‌ జగన్‌ను అభినందించిన విషయం తెలిసిందే.

తాజాగా అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కాథరీన్‌ హడ్డా వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలిపారు. ‘‘ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైఎస్‌ జగన్‌కు అభినందనలు. భవిష్యత్తులో అమెరికా, ఆంధ్రప్రదేశ్‌ మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నా’’ అని ట్వీట్‌ చేశారు. గతంలో వైఎస్‌ జగన్‌తో దిగిన ఫోటోను ఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు. కాగా నిన్న వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement