ఉంగుటూరు సమీపంలోని పెద్దావుటపల్లిలోని జోసఫ్ తంబి ఆలయంలో రెండు వారాల వయస్సు గల ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి వదిలివెళ్లారు.
ఉంగుటూరు సమీపంలోని పెద్దావుటపల్లిలోని జోసఫ్ తంబి ఆలయంలో రెండు వారాల వయస్సు గల ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి వదిలివెళ్లారు. ఆ శిశువుని స్థానికులు గుర్తించి ఆలయ సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో ఆలయ సిబ్బంది గత రాత్రాంత ఆ శిశువును తమ సంరక్షణలో ఉంచారు. ఆదివారం ఉదయం ఆ శిశువును విజయవాడలోని చైల్డ్లైన్కు అప్పగించారు.