బడ్జెట్లో ఏపీ రాజధాని నిధుల మాటేది? | union budget to disappointed us, says Somayajulu | Sakshi
Sakshi News home page

బడ్జెట్లో ఏపీ రాజధాని నిధుల మాటేది?

Feb 28 2015 3:06 PM | Updated on Aug 18 2018 5:50 PM

బడ్జెట్లో ఏపీ రాజధాని నిధుల మాటేది? - Sakshi

బడ్జెట్లో ఏపీ రాజధాని నిధుల మాటేది?

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని వైఎఎస్ఆర్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు సోమయాజులు అన్నారు.

హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని వైఎఎస్ఆర్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు సోమయాజులు అన్నారు. ఈ బడ్జెట్లో చెప్పుకోదగ్గ అంశాలేమి లేవని ఆయన అన్నారు. ఏపీ రాజధాని నిర్మాణ నిధుల గురించి కూడా బడ్జెట్లో లేదని సోమయాజులు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైల్వే బడ్జెట్ మాదిరి పాలసీ మేకింగ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు.

పోలవరానికి కేటాయించిన బడ్జెట్ నిధులు చూస్తుంటే ఇక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కానట్టేనని చెప్పారు. టీడీపీ, బీజేపీల మధ్య ఒప్పందం మేరకే పోలవరం పక్కన పెట్టి పట్టిసీమ ప్రాజెక్ట్ కడుతున్నారని ఆయన అన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల వివరాలు ఇప్పటికీ వెల్లడించలేదన్నారు. కాగా, 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను శనివారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement