జిల్లా కేంద్రంలోని బాబామెట్ట ఖాదర్ నగర్ లోని బావిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహాం కనిపించడంతో కలకలం రేగింది.
విజయనగరం: జిల్లా కేంద్రంలోని బాబామెట్ట ఖాదర్ నగర్ లోని బావిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహాం కనిపించడంతో కలకలం రేగింది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.
మృతుడి వయసు 25 సంవత్సురాలు ఉండవచ్చునని, ప్రస్తుతం అతడి వివరాలేవీ తెలియరాలేదని, శరీరంపై గాయాలను పరిశీలిస్తే ఎవరో హత్యచేసి బావిలో పడేశారని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.