ఇంటర్ పరీక్షలకు వెళ్తు... | Two students drown in water in kurnool district | Sakshi
Sakshi News home page

ఇంటర్ పరీక్షలకు వెళ్తు...

Jun 3 2014 11:03 AM | Updated on Sep 2 2017 8:16 AM

కర్నూలు జిల్లా గోకులపాడులో విషాదం చోటు చేసుకుంది. నెరవాడ వాగులో పడి తండ్రీకూతురు, మరో విద్యార్థిని గల్లంతయ్యారు.

కర్నూలు జిల్లా గోకులపాడులో విషాదం చోటు చేసుకుంది. నెరవాడ వాగులో పడి తండ్రీకూతురు, మరో విద్యార్థిని గల్లంతయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా వాగులో కొట్టుకుని పోతున్న తండ్రి మృతదేహన్ని స్థానికులు కనుగొని, ఒడ్డుకు తీసుకువచ్చారు. విద్యార్థినుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు స్థానికులు ముమ్మరం చేశారు. కన్న కూతురితో పాటు మరో విద్యార్థిని ఇంటర్ పరీక్షలకు తీసుకుని వెళ్తుండగా ఆ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement