ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులుఢీ కొన్నాయి.
కర్నూలు: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులుఢీ కొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా, కొంత మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా తాండ్రపాడులో జరిగింది.
వివరాలు..తిరుపతి నుంచి కర్నూలు, కర్నూలు నుంచి కడప వెళ్తున్న రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌ను మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్వల్పగాయాలైన ప్రయాణికులు ప్రాథమిక చికిత్స చేయించుకొని వెళ్లిపోయినట్లు సమాచారం.