అక్రమంగా రంగురాళ్లు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురవారం అరెస్ట్ చేశారు.
5 బస్తాల రంగురాళ్లు స్వాధీనం
దాచేపల్లి : అక్రమంగా రంగురాళ్లు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురవారం అరెస్ట్ చేశారు. సారంగపల్లి అగ్రహారానికి చెందిన జాఠవత్ కొండా నాయక్, ఆదూరి నరసింహారావు రంగురాళ్లను అక్రమంగా తరలిస్తుండటంతో అరెస్ట్ చేసి గురజాల కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై కట్టా ఆనంద్ తెలిపారు. ఎస్సై కథనం మేరకు.. శంకరపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో రంగురాళ్లను అక్రమంగా తవ్వించి విక్రయించేందుకు వాహనంలో తరలిస్తున్నారు.
దాచేపల్లిలోని నాయుడుపేట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారులో 5 బస్తాల రంగురాళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రంగురాళ్లను తరలిస్తున్న కొండానాయక్, నరసింహారావును అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై ఆనంద్ వెల్లడించారు.