చెట్టును ఢీకొన్న బైక్, ఒకరి మృతి | two killed in parawada road accident | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న బైక్, ఒకరి మృతి

Feb 27 2015 8:29 AM | Updated on Aug 30 2018 3:56 PM

విశాఖ జిల్లా పరవాడ సమీపంలో ఎన్టీపీసీ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

విశాఖ : విశాఖ జిల్లా పరవాడ సమీపంలో ఎన్టీపీసీ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.   ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

 

వీరంతా అచ్చుతాపురం నుంచి తిరిగి వస్తుండగా ...నిద్ర మత్తులో బైక్ నడుపుతున్న నాగిరెడ్డి వేగంగా చెట్టును ఢీకొన్నాడు. దాంతో అతను సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిలో పైడప్పనాయుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement