పిడుగులు పడి ఇద్దరు మృతి | Two killed as lightning fall | Sakshi
Sakshi News home page

పిడుగులు పడి ఇద్దరు మృతి

Sep 8 2015 1:15 AM | Updated on Apr 3 2019 8:07 PM

పిడుగులు పడి  ఇద్దరు మృతి - Sakshi

పిడుగులు పడి ఇద్దరు మృతి

పిడుగుల ప్రభావంతో జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఆదివారం రాత్రి కృత్తివెన్ను మండలం పోడు

జి.కొండూరు/కృత్తివెన్ను : పిడుగుల ప్రభావంతో జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఆదివారం రాత్రి కృత్తివెన్ను మండలం పోడు గ్రామంలో ఒకరు, సోమవారం సాయంత్రం జి.కొండూరు మండలం హెచ్.ముత్యాలంపాడులో మరొకరు చనిపోయారు. పోడు గ్రామానికి చెందిన ఎన్.పోతురాజు (55) చెరువులో పీత మేత వేయడానికి వెళ్లిన సమయంలో భారీ వర్షం కురియటం, పిడుగులు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతను ఎంతసేపటికీ ఇంటికి రాకపోవటంతో గాలింపు చేపట్టిన కుటుంబసభ్యులు ఆదివారం రాత్రి చెరువు వద్ద అతని మృతదేహాన్ని గుర్తించారు. సోమవారం అతని మృతదేహాన్ని బందరు ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జి.కొండూరు మండలం హెచ్.ముత్యాలంపాడులో గుంటూరు జిల్లా వినుకొండ మండలానికి చెందిన అమర్లపూడి దావీదు (35) కూలి పనుల నిమిత్తం వలస వచ్చి గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో ఉంటున్నాడు. ఈ క్రమంలో నాట్లు వేసేందుకు సోమవారం వెళ్లిన దావీదు ఇంటికి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పిడుగు పడింది. ఆ ప్రభావానికి అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దావీదుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement