రోడ్డుప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు | Two injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

Dec 8 2015 4:27 PM | Updated on Aug 30 2018 3:56 PM

శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని శివ్వాం గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం కారు-బైకు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వంగర (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని శివ్వాం గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం కారు-బైకు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌పై వెళుతున్న శివ్వాం గ్రామానికి చెందిన శ్రీనివాసులు కాలు విరిగింది. వెనుక కూర్చున్న అప్పలనాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని వంగర పోలీసులు పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement