తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సమీపంలో వ్యాను ఢీకొనడంతో భవానీ దీక్షలో ఉన్న ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
జగ్గంపేట (తూర్పు గోదావరి) : తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సమీపంలో వ్యాను ఢీకొనడంతో భవానీ దీక్షలో ఉన్న ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పత్తిపాడు మండలం వొమ్మంగి గ్రామం నుంచి 14 మంది భవానీ దీక్షాపరులు ఇరుముడి తీసుకుని శనివారం ఉదయం పాదయాత్రగా విజయవాడ ఇంద్రకీలాద్రికి బయల్దేరారు.
జగ్గంపేట సమీపంలో వెనుక నుంచి వచ్చిన వ్యాను ఢీకొనడంతో సుంకర రమేష్ (25), రాజు (16)కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని పెద్దాపురం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించే ఏర్పాటు చేశారు.