బైక్-లారీ ఢీ : ఇద్దరికి తీవ్రగాయాలు | two injured in road accident | Sakshi
Sakshi News home page

బైక్-లారీ ఢీ : ఇద్దరికి తీవ్రగాయాలు

Aug 18 2015 6:23 PM | Updated on Aug 30 2018 3:56 PM

ఎదురెదురుగా వస్తున్న లారీ, బైక్ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

విశాఖపట్నం (అనంతగిరి) : ఎదురెదురుగా వస్తున్న లారీ, బైక్ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతగిరి మండలం బీస్‌పురం గ్రామం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న పూజారి శివనాయుడు అనే వ్యక్తికి కుడికాలు విరగగా, కోనేటి సద్దు అనే వ్యక్తికి ఎడమకాలు విరిగింది.

క్షతగాత్రులను హుటాహుటిన విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement