గ్యాస్ సిలిండర్ పేలి దంపతులకు గాయాలు | two injured in gas cylinder blast at ysr district | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలిండర్ పేలి దంపతులకు గాయాలు

Dec 18 2015 9:47 AM | Updated on Aug 25 2018 5:39 PM

వైఎస్సార్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

ఖాజీపేట: వైఎస్సార్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఖాజీపేట మండలం వాసవీభవన్ దగ్గర శుక్రవారం తెల్లవారుజామున ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ సిలిండర్ పేలి భార్యభర్తలకు తీవ్రగాయాలయ్యాయి.

ఈ ఘటనలో భర్త అనిల్‌కు స్వల్పగాయాలు కాగా భార్య సుజాతకు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రి నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement