ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
మధిర, న్యూస్‌లైన్: ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మధిర మండలంలోని మునగాల(కృష్ణాపురం) సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బోనకల్ మండలం నారాయణపురం గ్రామానికి చెంది న సాధినేని ఉమ(38), మన్నేపల్లి సం దీప్‌లు ద్విచక్ర వాహనంపై మధిర నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం దుంది రాలపాడు గ్రామానికి చెందిన కంచెపొగు కొండయ్య(32), గంపలగూడేనికి చెందిన అతని బావ(సోదరి భర్త) కోట ప్రకాష్‌లు ద్విచక్ర వాహనంపై బోనకల్ మండలం తూటికుంట్ల నుంచి మధిర వైపు వస్తున్నారు. ఈ రెండు ద్విచక్ర వాహనాలు మునగాల సమీపంలోని రాగానే వేగంగా ఎదురెదురు గా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఉమ అక్కడికక్కడే మృతిచెందగా, కంచెపోగు కొండయ్య 108లో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో మృతి చెందాడు. ఉమ ద్వి చక్ర వాహనంపై ఉన్న సం దీప్ క్షేమం గా బయటపడగా కొండ య్య ద్విచక్ర వాహనంపై ఉన్న ప్రకాష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఖమ్మం రిఫర్‌చేశారు. వాహనాలు వేగం గా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిన ట్లు స్థానికులు అంటున్నారు. సంఘటన స్థలంలో మృతిచెందిన ఉమకు భార్య, కుమార్తె ఉన్నారు. మృతుడు బోనకల్ మండలం జానకీపురంలో మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. మరో మృతు డు కొండయ్య దుందిరాలపాడులో వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. అతని బావ గంపలగూడెంలోని ఒక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో వంటమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ప్రమాద సంఘటన సమాచారం తెలుసుకున్న మధిర రూరల్ ఎస్సై బండారుకుమార్ సంఘటన స్థలానికి వెళ్లి పంచనామ నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైద్యుల నిర్లక్ష్యం: క్షతగాత్రులను మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన అరగంట వరకు వైద్యులు రాలేదు. వైద్యులు వచ్చే వరకు విధి నిర్వహణలో ఉన్న ఏఎన్‌ఎం, 108 సిబ్బందే క్షతగాత్రులకు వైద్యం చేశారు. అరగంట తర్వాత ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు భాస్కర్‌రావు తాపీగా వచ్చి వైద్యం చేశారు. అప్పటికే క్షతగాత్రుడు ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు.