రైల్వే ట్రాక్ మధ్యలో సైకిల్ తొక్కాలన్న ఇద్దరు స్నేహితుల సరదా వారి ప్రాణాలను బలితీసుకుంది.
ఏలూరు అర్బన్ (పశ్చిమగోదావరి) : రైల్వే ట్రాక్ మధ్యలో సైకిల్ తొక్కాలన్న ఇద్దరు స్నేహితుల సరదా వారి ప్రాణాలను బలితీసుకుంది. ఏలూరులో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు పత్తేబాద ప్రాంతానికి చెందిన ఆవాల మౌళికుమార్(22), జన్యావుల మోహన్(18) స్నేహితులు. మౌళికుమార్ సెంట్రింగ్ వర్కర్‌గా పనిచేస్తుండగా, మోహన్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు.
కాగా గురువారం వీరిద్దరూ సీఆర్‌ఆర్ కళాశాల వెనుక హనుమాన్ నగర్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్ మధ్యలో సైకిళ్లు తొక్కుతుండగా విశాఖ నుంచి విజయవాడవైపు వెళ్లే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.