ఇద్దరు అరెస్ట్ : 3 కేజీల బంగారం స్వాధీనం | Two arrested, 3 Kg gold seized in Guntakal town | Sakshi
Sakshi News home page

ఇద్దరు అరెస్ట్ : 3 కేజీల బంగారం స్వాధీనం

Oct 30 2014 1:20 PM | Updated on Aug 25 2018 6:21 PM

అనంతపురం జిల్లా గుంతకల్లులో నకిలీ బంగారం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.

అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లులో నకిలీ బంగారం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 18 లక్షల నగదుతోపాటు మూడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ బంగారాన్ని అసలు బంగారం అంటూ సదరు వ్యక్తులు బంగారు దుకాణ దారుడిని మోసగించబోయారు. ఆ విషయాన్ని కనిపెట్టిన దుకాణదారుడు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement