చంద్రబాబు ఇంట్లో టీవీలు బంద్...! | TVs bandh in Chandrababu Naidu House | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఇంట్లో టీవీలు బంద్...!

Sep 25 2013 4:13 AM | Updated on Jul 25 2018 4:07 PM

చంద్రబాబు ఇంట్లో టీవీలు బంద్...! - Sakshi

చంద్రబాబు ఇంట్లో టీవీలు బంద్...!

దాదాపు 16 మాసాల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి విడుదలవుతున్న సందర్భంగా... రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు...

దాదాపు 16 మాసాల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి విడుదలవుతున్న సందర్భంగా... రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు... వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా టీవీల ముందే తిష్టవేశారు... చివరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి ఇంట్లో కూడా ఇదే పరిస్థితి... ఆయన నివాసంలో పనిచేసే వ్యక్తిగత, భద్రతా సిబ్బంది కూడా టీవీలను అంటిపెట్టుకుని జగన్ జైలు బయటకు వస్తున్న దృశ్యాలను వీక్షిస్తూ కూర్చున్నారు. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే బాబు ఇంట్లో ఉన్న టీవీలన్నీ ఒక్కసారిగా మూగబోయాయట. చంద్రబాబు ఇంట్లో, బయట, మీడియా గదుల్లోనూ ఉన్న దాదాపు 15 టీవీలూ ఆగిపోయాయట. ఏమైందో తెలియక అక్కడున్న వాళ్లంతా తలలు పట్టుకున్నారు. మొదట ఏదైనా సాంకేతిక సమస్యేమో అనుకున్నారు. కానీ ఎంతకూ టీవీలు రాకపోయేసరికి... కొందరు నేతలు ఆరాతీస్తే అసలు విషయం బయటపడిందట. కావాలనే టీవీలు బంద్ చేయించారని తెలిసి అందరూ అవాక్కయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement