సెట్‌టాప్ బాక్సులకు మరో 4 వారాలు: హైకోర్టు | TV setup boxes deadline extend for another 4 weeks : High court | Sakshi
Sakshi News home page

సెట్‌టాప్ బాక్సులకు మరో 4 వారాలు: హైకోర్టు

Aug 21 2013 3:48 AM | Updated on Sep 1 2017 9:56 PM

హైదరాబాద్, విశాఖపట్నంలో టీవీలకు సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు సమర్థించింది. ఎంఎస్‌వో(మల్టీసర్వీస్ ఆపరేటర్స్), ఎల్‌సీవో(లోకల్ ఏరియా కేబుల్ ఆపరేటర్స్)లు 4 వారాల్లో సెట్‌టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, విశాఖపట్నంలో టీవీలకు సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు సమర్థించింది. ఎంఎస్‌వో(మల్టీసర్వీస్ ఆపరేటర్స్), ఎల్‌సీవో(లోకల్ ఏరియా కేబుల్ ఆపరేటర్స్)లు 4 వారాల్లో సెట్‌టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. లేనిపక్షంలో గతంలో సెట్‌టాప్ బాక్సులను తప్పనిసరి చేస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను అమలు చేసుకోవచ్చునని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శికి మంగళవారం స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement