పోలీసుల అదుపులో టీవీ ఆర్టిస్ట్ విజయరాణి | TV Artist vijayarani under police control | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో టీవీ ఆర్టిస్ట్ విజయరాణి

Apr 9 2014 6:43 PM | Updated on Aug 21 2018 5:46 PM

బత్తుల విజయరాణి - Sakshi

బత్తుల విజయరాణి

టీవీ నటీనటులకు దాదాపు 10 కోట్ల రూపాయలకుపైగా శఠగోపం పెట్టి పారిపోయిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణిని సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: టీవీ నటీనటులకు దాదాపు 10 కోట్ల రూపాయలకుపైగా శఠగోపం పెట్టి పారిపోయిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణిని  సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను, ఆమె అనుచరులు పది మందిని  సీసీఎస్‌ పోలీసులు  బెంగళూరులో పట్టుకున్నారు.

చిట్టీల పేరుతో పలువురు ఆర్టిస్టులకు డబ్బు ఎగగొట్టిన విజయరాణి నెల రోజుల క్రితం పరారైంది.   బాధితుల ఫిర్యాదు మేరకు విజయరాణితో పాటు చెల్లెలు బి.సుధారాణి, నాని, శరణ్, శ్రీనివాస్‌రావు, హరిబాబు, దుర్గ, రమేష్‌లపై చీటింగ్, కుట్ర కేసులు నమోదు చేశారు. విజయరాణికి చెందిన రెండు ఇళ్లతో పాటు కారును  కూడా పోలీసులు సీజ్ చేశారు. వారి కోసం ఆరు పోలీస్ ప్రత్యేక బృందాలు వెతికాయి.   కూకట్‌పల్లిలోని ఓ లారీ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందం బెంగుళూరు వెళ్లి వారిని పట్టుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement