breaking news
	
		
	
  TV Artist vijayarani
- 
  
      మోసం చేయడం కాదు.. నేనే మోసపోయాను..
- 
  
      'చిట్టీల రాణి'... చిక్కిందిలా...
- 
  
      'చిట్టీల రాణీ'.. చిట్టచివరికిలా దొరికింది !
- 
      
                   
                                 పోలీసుల అదుపులో టీవీ ఆర్టిస్ట్ విజయరాణి
 హైదరాబాద్: టీవీ నటీనటులకు దాదాపు 10 కోట్ల రూపాయలకుపైగా శఠగోపం పెట్టి పారిపోయిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను, ఆమె అనుచరులు పది మందిని సీసీఎస్ పోలీసులు బెంగళూరులో పట్టుకున్నారు.
 
 చిట్టీల పేరుతో పలువురు ఆర్టిస్టులకు డబ్బు ఎగగొట్టిన విజయరాణి నెల రోజుల క్రితం పరారైంది. బాధితుల ఫిర్యాదు మేరకు విజయరాణితో పాటు చెల్లెలు బి.సుధారాణి, నాని, శరణ్, శ్రీనివాస్‌రావు, హరిబాబు, దుర్గ, రమేష్‌లపై చీటింగ్, కుట్ర కేసులు నమోదు చేశారు. విజయరాణికి చెందిన రెండు ఇళ్లతో పాటు కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. వారి కోసం ఆరు పోలీస్ ప్రత్యేక బృందాలు వెతికాయి. కూకట్‌పల్లిలోని ఓ లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందం బెంగుళూరు వెళ్లి వారిని పట్టుకుంది.


