పరాయి పాలన వద్దన్న కేసీఆర్.. తెలంగాణ రాగానే ఆ పార్టీ టికెట్లను అంగట్లో పెట్టాడని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాక్‌రావు ఆరోపించారు. శుక్రవారం వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గోదావరికి అడ్డంగా కట్టిన బాబ్లీ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు టీఆర్‌ఎస్ జహీరాబాద్ టికెట్టు ఇవ్వడం సిగ్గుచేటన్నారు.
దేవరుప్పుల, న్యూస్‌లైన్: పరాయి పాలన వద్దన్న కేసీఆర్.. తెలంగాణ రాగానే ఆ పార్టీ టికెట్లను అంగట్లో పెట్టాడని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాక్‌రావు ఆరోపించారు. శుక్రవారం వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గోదావరికి అడ్డంగా కట్టిన బాబ్లీ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు టీఆర్‌ఎస్ జహీరాబాద్ టికెట్టు ఇవ్వడం సిగ్గుచేటన్నారు.
పార్టీని నమ్ముకున్న వారిని పక్కకుపెట్టి మొన్నటి వరకు ఉద్యమానికి విఘాతం కల్పించిన కొండాసురేఖ లాంటి వారికి టికెట్లు కేటాయించడం దారుణమన్నారు. మందకృష్ణకు చట్టసభల్లో అవకాశం కల్పించేందుకు వర్దన్నపేట నియోజకవర్గంలో ఎన్‌డీఎ కూటమి పక్షాన అభ్యర్థులను విరమింపజేశామన్నారు.