తెలంగాణకు కరెంట్ సరఫరా చేయనివ్వకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుపడుతూ ఇక్కడి ప్రజల ఉసురు
సిద్దిపేట: తెలంగాణకు కరెంట్ సరఫరా చేయనివ్వకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుపడుతూ ఇక్కడి ప్రజల ఉసురు పోసుకుంటున్నారని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని, మాట్లాడారు.
రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు తెలంగాణకు 53 శాతం విద్యుత్ ఇవ్వాలని ఢిల్లీలో ఒప్పందం కుదిరినప్పటికీ ఆ మాటను చంద్రబాబు లెక్కచేయడం లేదన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని, ప్రతి రైతు తీసుకున్న రుణాన్ని మాఫీ చేసి తీరుతామన్నారు. పైరవీకారులను నమ్మొద్దని, ఏ అవసరమున్నా తానున్నానంటూ హరీశ్ ప్రజలకు భరోసా ఇచ్చారు.